తెలంగాణలో మూడు రోజులు వైన్స్ బంద్
- బార్లు కూడా తెరవొద్దని అధికారుల ఆదేశాలు
- యజమానులకు ముందస్తు సమాచారం
- సీఈసీ ఆదేశాలతో చర్యలు చేపట్టిన ఎక్సైజ్ శాఖ
ఈ నెల 28 నుంచి 30 వరకు వైన్స్ బంద్ పెట్టాలని, ఈ విషయంపై వైన్స్, బార్ల యజమానులకు ముందస్తుగా సమాచారం అందించాలని సూచించింది. సీఈసీ ఆదేశాల మేరకు ఈ నెలాఖరున మద్యం విక్రయాలు నిలిపివేసేలా చర్యలు చేపట్టినట్లు తెలంగాణ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ పేర్కొన్నారు. ఈమేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, వైన్ షాపుల యజమానులు, బార్ల యజమానులను అలర్ట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.