సెంచరీతో కోహ్లీ పుట్టిన రోజు సంబరాలు: మహమ్మద్ రిజ్వాన్
- నవంబర్ 5న కోహ్లీ 35వ పుట్టిన రోజు
- అదే రోజు దక్షిణాఫ్రికా-భారత్ మధ్య మ్యాచ్
- కోహ్లీ 49వ సెంచరీ సాధించాలంటూ రిజ్వాన్ ఆశాభావం
ఓ మీడియా సంస్థతో రిజ్వాన్ మాట్లాడిన సందర్భంగా కోహ్లీ పుట్టిన రోజు ప్రస్తావన వచ్చింది. అదే రోజు దక్షిణాఫ్రికాతో భారత్ కు మ్యాచ్ ఉండడంతో దీనిపై రిజ్వాన్ స్పందిస్తూ.. ‘‘కోహ్లీ పుట్టిన రోజు నవంబర్ 5న ఉందని తెలియడం సంతోషంగా ఉంది. నేను నా పుట్టిన రోజును జరుపుకోకపోయినా, నమ్మకపోయినా.. అతడికి నా తరఫున పుట్టిన రోజు శుభాకాంక్షలు. పుట్టిన రోజు నాడు వన్డే కెరీర్ లో 49వ సెంచరీ సాధించాలని ఆశిస్తున్నాను. ఈ ప్రపంచకప్ లోనే కోహ్లీ 50వ సెంచరీ కూడా సాధించాలని కోరుకుంటున్నాను’’ అని రిజ్వాన్ బదులిచ్చాడు. ఈ ప్రపంచకప్ లో కోహ్లీ మంచి ఫామ్ లో ఉండడం తెలిసిందే. దీంతో సెంచరీ సాధించడం అతడికి పెద్ద కష్టమేమీ కాదు.