ఆఫ్ఘనిస్థాన్‌పై మ్యాచ్‌లో అమాంతం వికెట్ల మీద పడిపోయిన కుశాల్ మెండిస్

Kusal Mendis fell on wickets in the match against Afghanistan
వరల్డ్ కప్‌లో భాగంగా సోమవారం పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై ఆఫ్ఘనిస్థాన్ సంచలన విజయం నమోదు చేసింది. 241 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి అబ్బురపరచింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన హైలెట్స్ చాలానే ఉన్నప్పటికి ఆఫ్ఘనిస్థాన్ ఛేజింగ్ చేస్తున్న సమయంలో శ్రీలంక కెప్టెన్, వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ ఓ బంతిని అందుకోబోయి అమాంతం స్టంప్స్‌పై పడిపోయాడు. చాలా హాయిగా పడిపోతున్నట్టు కుశాల్ కనిపించాడు. 

బేల్స్ వెలుగుతూ కిందపడిపోయాయి. చూడడానికి సరదాగా ఉన్న ఈ వీడియోను ఐసీసీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘స్టంప్స్ ఇలా ఎలా పడిపోయాయి?’ అంటూ క్యాప్షన్ ఇచ్చి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కాగా ఆఫ్ఘనిస్థాన్‌పై మ్యాచ్‌లో కుశాల్ మెండిస్ బ్యాటింగ్ ఫర్వాలేదనిపించినా ఆశించిన స్థాయిలో రాణించలేదు. 39 పరుగుల వద్ద ఔట్ అవడంతో ప్రారంభాన్ని పెద్ద స్కోరుగా మలచడంలో విఫలమయ్యాడు. ఇప్పటివరకు శ్రీలంక తరపున 6 ఇన్నింగ్స్‌లలో 44.66 సగటుతో 268 పరుగులు చేశాడు.
Go Back to Shorts
Sri Lanka
Cricket
Afghanistan

More Telugu News