లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు
- నవంబర్ 2న విచారణకు రావాలంటూ పిలుపు
- సిసోడియా బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైన గంటల వ్యవధిలోనే పరిణామం
- గతేడాది ఇదే అంశంపై సీబీఐ సమన్లు
కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేయడంపై ఆప్ సీనియర్ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ స్పందించారు. ఏది ఏమైనా ఆప్ పార్టీని నాశనం చేయాలనేది కేంద్ర ప్రభుత్వ ఏకైక లక్ష్యమని విమర్శించారు. ఇందుకోసం ఫేక్ కేసు సృష్టించడం సహా సాధ్యమైనవన్నీ చేస్తున్నారని ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్‌ను జైలుకు పంపి ఆమ్ ఆద్మీ పార్టీని నాశనం చేయాలనే ఆలోచనలో కేంద్రం ఉందని దుయ్యబట్టారు. కాగా కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయాలని ఢిల్లీ బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.