యూపీలో ఎన్ కౌంటర్ లో మొబైల్ స్నాచర్ హతం
- ఆటోలో వెళుతున్న యువతి చేతిలో నుంచి మొబైల్ లాక్కున్న జితూ
- ఈ ఘటనలో రన్నింగ్ ఆటో నుంచి కిందపడ్డ బీటెక్ స్టూడెంట్ కీర్తి సింగ్
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మొబైల్ స్నాచింగ్ కు పాల్పడిన దొంగలను గుర్తించిన పోలీసులు.. వారికోసం వేట ప్రారంభించారు. ఒక నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపించిన పోలీసులు.. రెండో నిందితుడు జితూ కోసం రాష్ట్రవ్యాప్తంగా గాలించారు. ఈ క్రమంలో ముస్సోరీ పోలీస్ స్టేషన్ పరిధిలో జితూ ఉన్నాడనే సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నంలో జితూ గంగానాహర్ ట్రాక్ పై పరుగులు పెట్టాడు. పోలీసుల పై దాడికి ప్రయత్నించగా.. పోలీసులు కాల్పులు జరపడంతో జితూ గాయపడ్డాడు. ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను చనిపోయాడని పోలీసులు తెలిపారు.