రోహిత్‌ శర్మ రికార్డు బద్దలుకొట్టిన ట్రావిస్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రోహిత్‌ శర్మ రికార్డు బద్దలుకొట్టిన ట్రావిస్

Travis breaks Rohit Sharma Record
  • ఈరోజు కివీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో 59 బంతుల్లో సెంచరీని చేసిన ట్రావిస్
  • వరల్డ్ కప్ లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు
  • 63 బంతుల్లో సెంచరీ చేసిన రోహిత్ శర్మ  
వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 59 బంతుల్లోనే తన సెంచరీని అందుకున్న ట్రావిస్... 67 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సులతో 109 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో ఒక అరుదైన ఘనతను సాధించాడు. వన్డే ప్రపంచ కప్ లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉంది. ప్రస్తుత వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ 63 బంతుల్లో సెంచరీ చేశాడు. ఆ రికార్డును ఇప్పుడు ట్రావిస్ బ్రేక్ చేశాడు.

Advertisement
Travis
Record
Rohit Sharma

More Telugu News