Chiranjeevi: ఆ చిత్రం నా జీవితంలో ఒక గొప్ప టర్నింగ్ పాయింట్: చిరంజీవి

Chiranjeevi recalls his memories of Khaidi movie
షార్ట్స్‌లో చూడండి
మెగాస్టార్ చిరంజీవికి కెరీర్ లో స్టార్ డమ్ తీసుకువచ్చిన చిత్రం అంటే 'ఖైదీ' అనే చెప్పాలి. ఆ సినిమా విడుదలై నేటికి నాలుగు దశాబ్దాలైంది. దీనిపై చిరంజీవి భావోద్వేగభరితంగా స్పందించారు. 'ఖైదీ' చిత్రం తన జీవితంలో ఒక గొప్ప టర్నింగ్ పాయింట్ అని వెల్లడించారు. ఆ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించిన తీరు ఎప్పటికీ మరువలేనిదని పేర్కొన్నారు. 'ఖైదీ' చిత్రం నిజంగానే అభిమానుల హృదయాల్లో తనను శాశ్వత ఖైదీని చేసిందని తెలిపారు. 

"ఖైదీ సినిమా విడుదలై నేటికి 40 సంవత్సరాలైంది. ఈ సందర్భంగా ఒకసారి ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నాను. ఈ చిత్ర దర్శకుడు కోదండరామిరెడ్డి, నిర్మాతలు సంయుక్త మూవీస్, రచయితలు పరుచూరి బ్రదర్స్ ను, ఈ సినిమాలో నాతో కలిసి నటించిన సుమలత, మాధవిలను, మొత్తం చిత్రబృందాన్ని అభినందిస్తున్నాను. అంతగొప్ప విజయాన్ని మాకందించిన తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు" అంటూ చిరంజీవి స్పందించారు.
Go Back to Shorts
Chiranjeevi
Khaidi
Movie
Megastar
Tollywood

More Telugu News