శ్రీలంక మీద ఓడిన ఇంగ్లండ్‌కు భారీ షాక్.. పాయింట్ల పట్టికలో సమీకరణం ఇదీ
- శ్రీలంక చేతిలో ఘోరంగా ఓడిన డిఫెండింగ్ ఛాంపియన్
- మరింతగా సన్నగిల్లిన టాప్-4 అవకాశాలు
- సెమీస్ అవకాశాలు దాదాపు ముగిసినట్టేనని విశ్లేషణలు
ఇంగ్లండ్ తన తదుపరి మ్యాచ్‌లను భారత్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, పాకిస్థాన్లతో ఆడనుంది. ఆతిథ్య భారత్, ఐదుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియాలు మంచి ఫామ్‌లో ఉన్నాయి. దీంతో ఈ జట్లపై గెలుపు ఇంగ్లిష్ జట్టుకు అంత సులభంగా ఉండకపోవచ్చు. దీంతో ఆ జట్టు సెమీఫైనల్ అవకాశాలు దాదాపు గల్లంతు అయినట్టేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలావుండగా ఇంగ్లండ్‌పై గెలుపుతో శ్రీలంక పాయింట్ల పట్టికలో ఐదవ స్థానానికి ఎగబాకింది. 5 మ్యాచ్‌లు ఆడి 2 విజయాలతో 4 పాయింట్లతో ఉంది. ఇక భారత్(10 పాయింట్లు), దక్షిణాఫ్రికా (8 పాయింట్లు), న్యూజిలాండ్ (8 పాయింట్లు), ఆస్ట్రేలియా (6 పాయింట్లు) వరుస 4 స్థానాల్లో ఉన్నాయి.