గజ్వేల్, కామారెడ్డిలలో కేసీఆర్ పోటీ.. నామినేషన్ ఎప్పుడంటే..!
- నవంబర్ 9న రెండుచోట్లా ఒకేసారి నామినేషన్
- తొలుత గజ్వేల్ లో.. తర్వాత కామారెడ్డిలో ఫైల్ చేయనున్న బీఆర్ఎస్ బాస్
- కామారెడ్డిలో కేసీఆర్ పై 120 మంది రైతుల పోటీ?
నామినేషన్ దాఖలు చేసిన తర్వాత సాయంత్రం కామారెడ్డిలో పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు. ఈసారి కామారెడ్డిలో పోటీ చేయాలని నిర్ణయించిన గులాబీ బాస్.. నియోజకవర్గం అభివృద్ధి చెందడం కోసమే తాను పోటీ చేస్తున్నట్లు చెప్పారు. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోవైపు, మాస్టర్ ప్లాన్ కారణంగా భూములు కోల్పోతున్న రైతులు చాలారోజులుగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయినాసరే ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఎన్నికల బరిలోకి దిగాలని రైతు ప్రతినిధులు నిర్ణయించారు. కామారెడ్డిలో బీఆర్ఎస్ బాస్ పై ఏకంగా 120 మంది పోటీ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. మాస్టర్ ప్లాన్ వివాదాన్ని పూర్తిస్థాయిలో పరిష్కరించాలనే డిమాండ్ తోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైతుల ప్రతినిధులు తెలిపారు.