బాలీవుడ్ నటి కంగన రనౌత్ అరుదైన ఘనత.. ఆ రికార్డు అందుకున్న తొలి మహిళగా నమోదు

Kangana Ranaut burn Ravan effigy at Dussehra event
బాలీవుడ్ స్టార్ నటి కంగన రనౌత్ అరుదైన ఘటన సాధించారు. దసరా సందర్భంగా ఢిల్లీలోని లవ్‌కుశ్ రాంలీలా మైదానంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న ఆమె రావణ దహనం చేసిన తొలి మహిళగా రికార్డులకెక్కారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్‌కుమార్ సక్సేనా తదితరులు హాజరయ్యారు. ఎర్రటి చీరకట్టులో కార్యక్రమానికి హాజరైన కంగన జైశ్రీరామ్ అంటూ రావణ, కుంభకర్ణ, మేఘనాథుల ప్రతిమలను దహనం చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శ్రీరాముడి వంటి వారు ఈ లోకంలోనే లేరని, అలాంటి పురుషుడు మళ్లీ రారని పేర్కొన్నారు. కాగా, బాణసంచా నిషేధించాలన్న ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో రికార్డు చేసిన బాణసంచా శబ్దాలను సౌండ్ బాక్స్‌ల ద్వారా వినిపించారు. కాగా, కంగన నటించిన ‘తేజస్’ సినిమా 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆమె ఆ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు.
Go Back to Shorts
Kangana Ranaut
Bollywood
Ravan Effigy
Dussehra
Lav Kush Ramleela

More Telugu News