గొడ్డళ్లు, వేటకొడవళ్లతో నరికి.. వైసీపీ కార్యకర్త దారుణ హత్య
- పల్నాడు జిల్లా గురజాల మండలంలో దారుణ ఘటన
- కళ్లలో కారం చల్లి.. దారుణ హత్య
- గ్రామంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేసిన పోలీసులు
కృష్ణారెడ్డి పులిపాడు ప్రభుత్వ వైన్ షాప్ లో సూపర్ వైజర్ గా పని చేస్తున్నాడు. ముసుగులు ధరించిన ఐదుగురు ప్రత్యర్థులు కళ్లలో కారం చల్లి హత్య చేశారని స్థానికులు తెలిపారు. ఈ హత్యకు రాజకీయాలు కారణమా లేక ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గురజాల మండలంలో ఉన్న జంగమహేశ్వరం గ్రామానికి ఫ్యాక్షన్ చరిత్ర ఉండటం గమనార్హం. మరోవైపు, టీడీపీ వాళ్లే ఈ హత్య చేయించారని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.