Shraddha Srinath: కన్నడలో పెద్ద హిట్ కొట్టిన 'జెర్సీ' హీరోయిన్ మూవీ .. ఇక ఆహాలో!

శ్రద్ధా శ్రీనాథ్ తన కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి వరుస సినిమాలు చేస్తూ వెళుతోంది. కన్నడ .. తమిళ భాషల్లో ఎక్కువగా సినిమాలు చేస్తూ వెళుతున్న శ్రద్ధ, అడపాదడపా తెలుగులోను చేస్తోంది. తెలుగులో ఆమె చేసిన సినిమాల్లో 'జెర్సీ' ఎక్కువగా గుర్తుండిపోతుంది. త్వరలో రానున్న వెంకటేశ్ 'సైంధవ్' సినిమాలోనూ ఆమెనే నాయిక. 

అలాంటి శ్రద్ధా శ్రీనాథ్ కన్నడలో ఈ మధ్య 'ఆపరేషన్ అలమేలమ్మ' సినిమా చేసింది. చిన్న సినిమాగా థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, అక్కడ పెద్ద హిట్ గా నిలిచింది. 'సుని' దర్శకత్వం వహించిన ఈ సినిమాను, 'ఆహా'లో ఈ నెల 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. 

శ్రద్ధా శ్రీనాథ్ జోడీగా ఈ సినిమాలో 'రిషి' కనిపించనున్నాడు. 'సైతాన్' వెబ్ సిరీస్ హీరోగా ఆయన ఇక్కడివారికి  సుపరిచితమే. ఈజీగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పరమేశ్ అనే యువకుడు ఒక బిజినెస్ మేన్ కొడుకును కిడ్నాప్ చేస్తాడు. ఆ డ్రామాలోకి మిగతా పాత్రలు ఎలా వచ్చి చేరాయనేదే కథ. హాస్య ప్రధానంగా సాగే ఈ కథకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది చూడాలి.
Shraddha Srinath
Rishi
Suni
Aha

More Telugu News