VVS Laxman: శ్రీవారి ఆలయ అలంకరణ కోసం వీవీఎస్ లక్ష్మణ్ విరాళం

భారత క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి విరాళం ప్రకటించారు. ప్రస్తుతం బ్రహ్మోత్సవాలు జరుగుతుండగా, ఆలయ అలంకరణ నిమిత్తం ఒక్కరోజుకు అయ్యే ఖర్చును ఆయన విరాళంగా అందించారు. వీవీఎస్ లక్ష్మణ్ టీటీడీకి రూ.14 లక్షల విరాళం అందించారు. కాగా, కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వచ్చిన లక్ష్మణ్ ఈ ఉదయం నైవేద్య విరామం సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయ సన్నిధిలోని రంగనాయకుల మంటపంలో అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు లక్ష్మణ్ ను పట్టువస్త్రంతో సత్కరించి, ఆయనకు తీర్థ ప్రసాదాలు అందించారు.
VVS Laxman
Donation
Tirumala
TTD

More Telugu News