చాన్నాళ్లకు... మూడు బంతులు వేసి రెండు పరుగులిచ్చిన విరాట్ కోహ్లీ
- బౌలర్ అవతారమెత్తిన విరాట్ కోహ్లీ
- బౌలింగ్ చేస్తూ గాయపడిన హార్దిక్ పాండ్యా
- మోకాలి నొప్పితో బాధపడుతూ డగౌట్‌కు పరిమితమైన పాండ్యా
- మిగిలిన మూడు బంతులు వేసిన విరాట్ కోహ్లీ
మూడు బంతులు వేసిన విరాట్ కోహ్లీ రెండు సింగిల్స్ మాత్రమే ఇచ్చాడు. మీడియం పేస్, స్పిన్‌ను కలిపి వేసిన బౌలింగ్‌లో బంగ్లా బ్యాటర్లు షాట్ కొట్టేందుకు కూడా యత్నించలేదు. ఆరేళ్ల తర్వాత కోహ్లీ వన్డేల్లో బౌలింగ్ చేయడం మళ్లీ ఇదే మొదటిసారి. చివరిగా 2017 అగస్ట్ 31న శ్రీలంకపై రెండు ఓవర్లు వేసి 12 పరుగులు ఇచ్చాడు.