చంద్రబాబుతో ములాఖత్‌లు పెంచాలని న్యాయవాదుల పిటిషన్
- వివిధ పిటిషన్లపై చంద్రబాబుతో మాట్లాడేందుకు అవకాశం కావాలన్న న్యాయవాదులు
- న్యాయపరమైన అంశాలపై చర్చించేందుకు చంద్రబాబును కలిసేందుకు అవకాశం ఇవ్వడం లేదని వెల్లడి
- ములాఖత్‌లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్న న్యాయవాదులు
వివిధ పిటిషన్లపై చంద్రబాబుతో మాట్లాడటానికి తమకు అవకాశం ఇవ్వాలన్నారు. న్యాయపరమైన అంశాల మీద చర్చించేందుకు చంద్రబాబుతో కలిసేందుకు జైలు అధికారులు అంగీకరించడం లేదని తెలిపారు. ములాఖత్ ఇవ్వకుండా జైలు అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. చంద్రబాబు లాయర్ల లీగల్ ములాఖత్‌పై పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని న్యాయమూర్తి తెలిపారు.