గాంధీభవన్ రిమోట్ గాడ్సే చేతిలో మాడి మసైపోతోంది: కేటీఆర్
- తెలంగాణలో రాహుల్, ప్రియంక గాంధీల బస్సు యాత్ర
- బస్సు యాత్ర తుస్సుమంటుందని కేటీఆర్ జోస్యం
- నమ్మి గద్దెనెక్కించిన కర్ణాటక ప్రజలను ముంచిన కాంగ్రెస్‌ను తెలంగాణ నమ్మదని వ్యాఖ్య
- కాంగ్రెస్‌పై నిప్పులు చెరుగుతూ సోషల్ మీడియాలో కేటీఆర్ సుదీర్ఘ పోస్ట్
నమ్మి ఓటేసిన కర్ణాటక ప్రజలను నట్టేట ముంచిన కాంగ్రెస్ తెలంగాణలో నాటకాలకు తెరతీస్తే ఎవరూ నమ్మరని కేటీఆర్ అన్నారు. గాంధీభవన్‌ను గాడ్సేకు అప్పగించిన నాడే తెలంగాణ కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్ మొదలైందని పేర్కొన్నారు. గాంధీభవన్ రిమోటే గాడ్సే చేతిలో పడి మాడి మసైపోతోందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు కేటీఆర్ ‘ఎక్స్’లో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.