పాక్ జట్టుకు అంత సీన్ లేదన్న భారత జట్టు మాజీ పేసర్
- మన సీ టీమ్ కూడా ఆ జట్టును ఓడిస్తుందని శ్రీశాంత్ ధీమా
- స్పోర్ట్స్ కీడా కార్యక్రమంలో మాట్లాడిన శ్రీశాంత్
- ఇండియాతో ఫైనల్లో తలపడతామన్న పాక్ జట్టు డైరెక్టర్
ఈ మ్యాచ్ తర్వాత బాబర్ అజాం కెప్టెన్సీలోని పాక్ జట్టు సామర్థ్యంపైన ఆ దేశ అభిమానులకూ సందేహాలు రేకెత్తాయి. పలువురు మాజీలు కూడా పాక్ జట్టు ఆట తీరుపై పెదవి విరుస్తున్నారు. అయితే, ఆ జట్టు డైరెక్టర్ మిక్కీ ఆర్థర్ మాత్రం తమ ఆటగాళ్లపై నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇండియాతో తమ జట్టు ఫైనల్ లో తలపడుతుందని ధీమాగా చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలపై శ్రీశాంత్ స్పందిస్తూ.. పాక్ జట్టు ఆటతీరు నాసిరకంగా ఉందని, భారత్ లోని సీ టీమ్ కూడా ఆ జట్టును ఓడిస్తుందని అన్నారు. ఇలాంటి టీమ్ తో భారత జట్టుపై ఆడి గెలవాలని అనుకోవడం అత్యాశేనని చెప్పారు. ఇలాగే ఆడితే ఫైనల్ దాకా చేరడం కూడా కష్టమేనని శ్రీశాంత్ విమర్శించారు.