'కాంగ్రెస్ గెలిచాక సోనియా ఎదుట మొదటి ఉద్యోగం నీకే' అంటూ యువతికి రేవంత్ రెడ్డి 'గ్యారెంటీ' హామీ
- రేవంత్ రెడ్డిని కలిసిన నాంపల్లికి చెందిన దివ్యాంగురాలు రజిని
- డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం రోజునే ఉద్యోగం ఇస్తామని హామీ
- స్వయంగా గ్యారెంటీ కార్డు రాసిచ్చిన రేవంత్ రెడ్డి
ప్రవళిక ఆత్మహత్యపై రేవంత్ రెడ్డి
కాగా, మధ్యాహ్నం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న ప్రవళిక అంశంపై స్పందించారు. ప్రవళిక ఆత్మహత్యపై పోలీసు అధికారి తీవ్రమైన ఆరోపణలు చేశారని, ఆమె కుటుంబం పరువుకు నష్టం కలిగేలా మాట్లాడారని మండిపడ్డారు. ప్రవళికకు సంబంధించిన హాల్ టిక్కెట్, సహా అన్ని వివరాలు ఉన్నాయన్నారు. కానీ పోలీసు అధికారి మాత్రం ప్రేమ విఫలమై చనిపోయినట్లుగా చెప్పడం విడ్డూరమన్నారు.
ప్రవళిక విషయంలో ప్రెస్ మీట్ పెట్టిన డీసీపీపై కేసు పెడతామన్నారు. అమ్మాయి ఫోన్ సీజ్ చేస్తే సమాచారం ఎలా బయటకు వచ్చిందో చెప్పాలన్నారు. ఫోన్ ఓపెన్ చేయాలంటే కోర్టు అనుమతి ఉండాలన్నారు. ఫోరెన్సిక్ నివేదిక రాకముందే డీసీపీ ప్రెస్ మీట్ ఎలా పెడతారు? అని ప్రశ్నించారు. డీసీపీపై ఎన్నికల కమిషన్‌కూ ఫిర్యాదు చేస్తామన్నారు.