ఆ అడ్డంకి దాటితే చాలు... కప్ టీమిండియాదే: షోయబ్ అక్తర్
- వరల్డ్ కప్ లో పాకిస్థాన్ ను చిత్తుగా ఓడించిన భారత్
- పాక్ చిన్న పిల్లల జట్టులా కనిపించిందన్న అక్తర్
- వరల్డ్ కప్ లో టీమిండియా సరైన పంథాలో వెళుతోందని వెల్లడి
- 2011 నాటి ఫలితాన్ని టీమిండియా పునరావృతం చేస్తుందని వ్యాఖ్యలు
ఈ నేపథ్యంలో, పాకిస్థాన్ మాజీ స్పీడ్ స్టర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాక్ జట్టును టీమిండియా అన్ని రంగాల్లో చిత్తు చేసిందని అన్నాడు. పాక్ ను కోలుకోలేని దెబ్బకొట్టిందని పేర్కొన్నాడు. టీమిండియా ముందు పాక్ ఓ చిన్న పిల్లల జట్టులా కనిపించిందని అక్తర్ విమర్శించాడు. పాక్ అంత దారుణంగా ఓటమిపాలవడాన్ని తాను చూడలేకపోయానని తెలిపాడు.
ఈ వరల్డ్ కప్ లో టీమిండియా సరైన పంథాలో వెళుతోందని అన్నాడు. సెమీఫైనల్ అడ్డంకి దాటితే వరల్డ్ కప్ టీమిండియాదేనని అక్తర్ నమ్మకం వ్యక్తం చేశాడు. 2011 నాటి ఫలితాన్ని టీమిండియా పునరావృతం చేయడం ఖాయంగా కనిపిస్తోందని వెల్లడించాడు.