హుటాహుటిన ఢిల్లీ నుంచి రాజమండ్రికి నారా లోకేశ్
- ఉదయం 9 గంటలకు విజయవాడకు చేరుకున్న లోకేశ్
- అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రాజమండ్రికి పయనం
- చంద్రబాబు ఆరోగ్యం నేపథ్యంలోనే ఢిల్లీ నుంచి వచ్చినట్టు సమాచారం
చంద్రబాబుకు స్టెరాయిడ్స్ ఇచ్చి ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని అచ్చెన్నాయుడు ఆరోపించారు. తన తండ్రి ఆరోగ్యం నేపథ్యంలోనే లోకేశ్ ఢిల్లీ నుంచి హుటాహుటిన వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు రాజమండ్రిలోని క్యాంప్ ఆఫీసులో టీడీపీ కీలక నేతలతో లోకేశ్ భేటీ అవనున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.