అలా అయితే పొన్నాల లక్ష్మయ్య ఇంటికి వెళ్తాను!: మంత్రి కేటీఆర్
- పొన్నాల బీఆర్ఎస్లో చేరుతామంటే సాదరంగా ఆహ్వానిస్తామన్న మంత్రి కేటీఆర్
- త్వరలో చాలామంది తమ పార్టీలోకి వస్తారన్న కేటీఆర్
- అభ్యర్థుల ప్రకటన తర్వాత గాంధీ భవన్లో తన్నుకుంటారన్న మంత్రి
అభ్యర్థుల ప్రకటన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్లో తన్నుకుంటారన్నారు. ఆ పార్టీ నుంచి తమ పార్టీలోకి వస్తారన్నారు. కాంగ్రెస్లో ముఖ్యమంత్రి పదవి కోసం ఇద్దరు నేతల మధ్య అంగీకారం కుదిరినట్లుగా తెలుస్తోందని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీని లీడర్ అనడం కంటే రీడర్ అంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు.
తెలంగాణ తల్లి ఆత్మగౌరవానికి, గుజరాత్ అహంకారానికి పోటీ జరుగుతోందన్నారు. తమపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు గాను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈసారి కూడా బీజేపీ 110 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోవడం ఖాయమని, సింగిల్ డిపాజిట్కే పరిమితమవుతుందన్నారు. బీజేపీతో తమకు ఎలాంటి అవగాహన లేదన్నారు.