చంద్రబాబు ఆరోగ్యంపై లోకేశ్ ట్వీట్ బాధ కలిగించింది: కేటీఆర్
- జైల్లో చంద్రబాబు ఆరోగ్యానికి హాని తలపెడుతున్నారన్న లోకేశ్
- చంద్రబాబు పట్ల రాక్షసంగా వ్యవహరిస్తున్నారంటూ ట్వీట్
- కుమారుడిగా తండ్రి ఆరోగ్యం పట్ల ఆందోళన ఎలా ఉంటుందో తనకు తెలుసన్న కేటీఆర్
లోకేశ్ ట్వీట్ పై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. చంద్రబాబు ఆరోగ్యంపై లోకేశ్ ట్వీట్ బాధ కలిగించిందని అన్నారు. కుమారుడిగా తండ్రి ఆరోగ్యంపై ఆందోళన ఎలా ఉంటుందో నాకు తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో కేసీఆర్ నిరాహార దీక్ష సమయంలో తనకు కూడా ఆందోళన కలిగిందని వెల్లడించారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలనే ఇక్కడ ఆందోళనలు వద్దంటున్నామని కేటీఆర్ పునరుద్ఘాటించారు.