బీజేపీ నేత వసుంధర రాజే కాళ్లు మొక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. వీడియో వైరల్
- తన్సింగ్ చౌహాన్ స్మారక సేవా కార్యక్రమంలో ఘటన
- మిమ్మల్ని ఇక్కడిలా చూడడం బాగుందన్న వసుంధర రాజే
- బార్మర్ నుంచి మూడుసార్లు ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యే
ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే పేరు మేవారామ్ జైన్. బార్మర్ నుంచి మూడుసార్లు విజయం సాధించారు. తన్ సింగ్ చౌహాన్ స్మారకార్థం నిర్వహించిన సేవా కార్యక్రమానికి మేవారామ్ హాజరయ్యారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు కూడా హాజరయ్యారు. ఎమ్మెల్యే తన కాళ్లను స్పృశించిన వెంటనే వసుంధర రాజే మైక్ తీసుకుని మాట్లాడుతూ.. మీడియా ప్రతినిధులు ఇది వినాలని, ఇదో సామాజిక కార్యక్రమమని పేర్కొన్నారు. 36 సామాజిక వర్గాలను ఇది కలిపే కార్యక్రమమని స్పష్టం చేశారు. కాగా, ఈ ఏడాది చివరినాటికి రాజస్థాన్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి.