బండారు సత్యనారాయణమూర్తిని టెర్రరిస్టులా అరెస్ట్ చేశారు: నారా లోకేశ్

టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. బూతు కూతలు వద్దని హితవు పలికిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు ఓ టెర్రరిస్టులా అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ముఖ్యమంత్రి, మంత్రులు, ఆ పార్టీ నేతలు కూసే రోత బూతు కూతలపై ఎన్ని వేల కేసులు నమోదు చేయాలి? అని లోకేశ్ ప్రశ్నించారు. వైసీపీకి ఓ చట్టం, విపక్షాలకు మరో చట్టమా... ఇదేం అరాచక పాలన? అని నిలదీశారు.

Nara Lokesh
Bandaru Sathyanarayana Murthy
Arrest
TDP
YSRCP

More Telugu News