రజినీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్న ‘లాల్ సలాం’.. 2024 సంక్రాంతికి వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్
- ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో లాల్ సలాం
- విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా భారీ చిత్రం
- ముంబయి డాన్ గా కీలక పాత్ర పోషిస్తున్న రజనీకాంత్
- శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు
ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాను 2024 సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. రీసెంట్‌గా జైలర్‌తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తలైవర్ ఇప్పుడు ‘లాల్ సలాం’తో సంక్రాంతికి అలరించనుండటంతో ఆయన అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లోనూ అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి.
ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్స్ ప్రతినిధులు మాట్లాడుతూ ‘‘సూపర్‌స్టార్ రజినీకాంత్‌గారితో మా అనుబంధం కొనసాగుతుండటం మాకెంతో ఆనందంగానూ, గర్వంగానూ ఉంది. మా రిక్వెస్ట్ మేరకు ఆయన ఈ చిత్రంలో ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటించారు’’ అని వెల్లడించారు. లాల్ సలాం చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.