షాకింగ్: విదేశాల్లోని బిచ్చగాళ్లలో 90 శాతం మంది పాకిస్థానీయులే!

90 per cent of beggars arrested in foreign countries belong to Pakistan
షార్ట్స్‌లో చూడండి
విదేశాల్లో అరెస్టవుతోన్న యాచకుల్లో తొంబై శాతం పాకిస్థానీయులే ఉంటున్నట్లుగా అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. జేబుదొంగల్లో అత్యధికంగా పాక్ జాతీయులు ఉన్నట్లు తేలింది. ఈ విషయాన్ని పాక్ ప్రభుత్వమే తెలిపింది. విదేశాల్లో పాకిస్థానీలకు సంబంధించి అక్కడి సెనేట్ లో చర్చ జరిగింది. ఈ సందర్భంగా పాకిస్థాన్‌కు చెందిన బిచ్చగాళ్లు భారీ సంఖ్యలో విదేశాలకు వెళ్తున్నట్లు విదేశాంగ శాఖ సెక్రటరీ జుల్ఫికర్ హైదర్ తెలిపారు. విదేశాల్లో అరెస్టవుతున్న వారిలో తొంబై శాతం మంది తమ దేశానికి చెందినవారే ఉన్నట్లు తెలిపారు.

ఇందులో ఎక్కువమంది సౌదీ, ఇరాన్, ఇరాక్‌లకు వెళ్లేందుకు టూరిస్ట్ వీసాను ఉపయోగించుకుంటున్నట్లుగా తెలిపారు. వివిధ దేశాల్లోని పవిత్రస్థలాల్లో అరెస్టవుతోన్న జేబు దొంగల్లోను పాక్ జాతీయులే అధికమని తెలిపారు. పశ్చిమాసియా దేశాలతో పాటు ఇటీవలి కాలంలో జపాన్ కూడా పాక్ జేబుదొంగలకు గమ్యంగా మారింది. భారత్ ఓ వైపు చంద్రుడి పైకి వెళ్లే ప్రయోగాలు చేయగా, పాక్ మాత్రం ఎప్పటికప్పుడు పొరపాట్లు చేస్తోందన్నారు.

సౌదీలో దాదాపు 30 లక్షలు, యూఏఈలో దాదాపు 15 లక్షలు, ఖతార్‌లో 2 లక్షల మంది పాకిస్థానీలు ఉన్నారు. ఇటీవల తమ దేశం నుంచి విదేశాలకు వెళ్తోన్న యాచకుల సంఖ్య భారీగా ఉందని నివేదిక తెలిపింది. యాచకుల సంఖ్య తమ దేశానికి పెరగడం పట్ల సౌదీ, ఇరాక్ వంటి దేశాలు పాకిస్థాన్‌కు హెచ్చరికలు కూడా జారీ చేశాయని తెలుస్తోంది.
Go Back to Shorts
Pakistan
begggar

More Telugu News