ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై మరోసారి సీబీ‘ఐ’
- అధికారిక నివాసం నిర్మాణంలో అక్రమాలు, ఉల్లంఘనల ఆరోపణలు
- సుందరీకరణ పనుల కోసం కేజ్రీవాల్ దాదాపు రూ. 45 కోట్ల ఖర్చు
- హోంశాఖ ఆదేశాలతో సీబీఐ విచారణ మొదలు
ఇంటీరియర్ డెకరేషన్ కు రూ.11.30 కోట్లు, స్టోన్ మార్బుల్ ఫ్లోరింగ్ కు రూ.6.02 కోట్లు, ఇంటీరియర్ కన్సల్టెన్సీకి రూ.కోటి, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ కు రూ.2.58 కోట్లు ఖర్చు చేసినట్టు ఈ నివేదికలో పేర్కొన్నారు. ఢిల్లీ ప్రధాన కార్యదర్శి నివేదికలో ప్రస్తావించిన అంశాలు, ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ అన్ని కోణాల్లోనూ విచారించనుంది. కాగా, ఈ ఆరోపణలను ఆమ్‌ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. సీఎం ఇంటి నిర్మాణంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.