అప్పులు చేసి పెళ్లిళ్లు చేయవద్దన్న కర్ణాటక ముఖ్యమంత్రి... ఎందుకంటే..!
- సాధారణ, సామూహిక వివాహాలు ప్రోత్సహించాలని సూచన
- రుణాలు పొంది, అప్పులు చేసి ఆడంబరంగా పెళ్లి చేయడం మానుకోవాలని వ్యాఖ్య
- ఆడంబరాల కోసం చేసే అప్పులు తీర్చేందుకు జీవితాంతం కష్టపడాల్సి వస్తోందన్న సీఎం
వ్యవసాయ రుణాలు పొంది ఆడంబరంగా పెళ్లి వేడుకలు నిర్వహించడం మానుకోవాలన్నారు. పేదలు, మధ్య తరగతి ప్రజలు గొప్పలకు పోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారన్నారు. బయట రుణాలు తీసుకువచ్చి ఆర్భాటంగా పెళ్లిళ్లు చేయడం ఎంతమాత్రం పద్ధతి కాదన్నారు. పేద, శ్రామిక వర్గాల ప్రజలు ఆడంబరాల కోసం చేసిన అప్పులు తీర్చేందుకు జీవితాంతం కష్టపడాల్సి వస్తోందన్నారు. అందుకే సమాజం నిరాడంబరంగా జరిగే సామూహిక వివాహాలను ప్రోత్సహించాలన్నారు.