Srikanth Addala: 'సీతమ్మవాకిట్లో' సీక్వెల్ పై స్పందించిన శ్రీకాంత్ అడ్డాల

Srikanth Addala Interview
షార్ట్స్‌లో చూడండి
శ్రీకాంత్ అడ్డాల అనగానే లవ్ .. ఫ్యామిలీ ఎమోషన్స్ పాళ్లు ఎక్కువగా ఉన్న ఆయన సినిమాలు గుర్తుకు వస్తాయి. ఆ రెండు అంశాలతో పాటు ఈ సారి ఆయన గ్రామీణ నేపథ్యంలో రాజకీయాలను కూడా టచ్ చేస్తూ 'పెదకాపు' సినిమా చేశాడు. ఈ నెల 29వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆయన బిజీగా ఉన్నాడు. 

తాజాగా 'గ్రేట్ ఆంధ్ర'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ .. 'పెదకాపు' అనేది కులానికి సంబంధించిన విషయాలను .. అంశాలను ప్రస్తావించే కథ కాదు. ఒక సాధారణ యువకుడు తన ప్రయాణాన్ని ఎలా మొదలుపెట్టాడు .. అనుకున్నది సాధించడం కోసం ఎన్ని కష్టాలు పడ్డాడనేది ఫస్టు పార్టులో ఉంటుంది. తాను అనుకున్న స్థాయికి చేరుకున్న తరువాత అతను ఏం చేస్తాడు? అనేది సెకండ్ పార్టులో ఉంటుంది" అని అన్నాడు. 

నేను తీసిన సినిమాల్లో 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' గురించే ఇప్పటికీ అంతా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి సినిమా చేయమని అడుగుతూ ఉంటారు. రీసెంటుగా దిల్ రాజుగారు కూడా ఆ సినిమాకి సీక్వెల్ చేస్తే బాగుంటుందని నాతో అన్నారు. ఆ సినిమా సీక్వెల్ చేస్తున్నట్టు ఆయనకు కల వచ్చిందట. తెల్లవారు జామునే కాల్ చేసి నాకు చెప్పారు. అన్నీ కుదిరితే తప్పకుండా చేద్దామని నేను అన్నాను" అని చెప్పాడు.
Go Back to Shorts
Srikanth Addala
Pedakapu Movie
Tollywood

More Telugu News