ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టు
- స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ పరిశీలనకు వెళుతుండగా అడ్డుకున్న పోలీసులు
- పొన్నూరు పోలీస్ స్టేషన్ కు తరలింపు
- స్టేషన్ వద్దకు భారీగా చేరుకున్న టీడీపీ శ్రేణులు
ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టు విషయం తెలిసి పొన్నూరు స్టేషన్ కు టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున చేరుకున్నారు. నరేంద్ర అరెస్టు అక్రమమంటూ స్టేషన్ ముందు ఆందోళన చేస్తున్నారు. అంతకుముందు పొన్నూరు మండలం చింతలపూడిలో టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి ధూళిపాళ్ల మాట్లాడుతూ.. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, ఇందులో భాగంగానే చంద్రబాబును అరెస్టు చేసిందని ఆరోపించారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ ద్వారా లక్షలాది మంది విద్యార్థులు శిక్షణ పొందినా ఈ ప్రభుత్వం కళ్లుండి కూడా చూడలేకపోతోందని మండిపడ్డారు. అధికారులపై మంత్రులు ఒత్తిడి తెచ్చి చంద్రబాబును కేసులో ఇరికించారని, లోకేశ్ ను కూడా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ధూళిపాళ్ల విమర్శించారు.