క్రేజీ కాంబినేషన్.. సూర్యతో బోయపాటి సినిమా!
- తెలుగు, తమిళ భాషల్లో రానున్న చిత్రం
- ప్రస్తుతం ‘కంగువ’ చిత్రంలో నటిస్తున్న సూర్య
- ఈ నెల 28న విడుదల కానున్న బోయపాటి-రామ్ ‘స్కంద’
బోయపాటి శ్రీను మాస్ మసాలా చిత్రాలకు ఫేమస్ కాగా.. సూర్య ఎలాంటి పాత్రలోనైనా మెప్పించగలడు. ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న సినిమా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. బోయపాటి గతంలో పలు ఇంటర్వ్యూలలో సూర్యతో కలిసి పనిచేయాలనే తన కోరికను ప్రస్తావించారు. సూర్య ప్రస్తుతం ‘కంగువ’ అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శివ రపొందిస్తున్నాడు. బాలీవుడ్ నటి దిశా పటాని కథానాయికగా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా 10 భాషల్లో విడుదల కానుంది.