‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోనీ ఇంట విషాదం.. కుమార్తె మీరా ఆత్మహత్య
- చెన్నై అల్వార్‌పేటలోని ఇంట్లో దుపట్టాతో ఉరివేసుకున్న మీరా
- చర్చ్ పార్క్ స్కూల్లో 12వ తరగతి చదువుతున్న బాలిక
- గత కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతున్న మీరా
- కుమార్తె ఆత్మహత్య సమయంలో ఇంట్లో లేని విజయ్
గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కావేరీ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మీరా అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కుమార్తె ఆత్మహత్య సమయంలో ఆంటోనీ ఇంట్లో లేరని సమాచారం. మీరా ఆత్మహత్యకు ఒత్తిడే కారణమని తెలుస్తోంది. మీరా గతకొంత కాలంగా డిప్రెషన్‌తో బాధపడుతూ చికిత్స కూడా తీసుకుంటోందని సమాచారం.