సికింద్రాబాద్‌లో ఆల్ఫా హోటల్ సీజ్!
- హోటల్ వంటగదిలో అపరిశుభ్ర వాతావరణం, నాణ్యత లేని ఆహారం గుర్తించిన అధికారులు
- అంతకుమునుపు, హోటల్లో పరిస్థితిపై జీహెచ్ఎంసీకి పలువురి ఫిర్యాదు
- అపరిశుభ్ర వాతావరణానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్
- తనిఖీలు నిర్వహించిన జీహెచ్ఎంసీ అధికారులు
- తదుపరి చర్యలు తీసుకునే వరకూ హోటల్ మూయించేసిన వైనం
కాగా, ఆదివారం కూడా అధికారులు మరోమారు హోటల్లో తనిఖీలు చేపట్టారు. హోటల్ నిర్వహణలో యాజమాన్యం నిర్లక్ష్యపూరిత ధోరణి గుర్తించారు. దీంతో, దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని వారిని హెచ్చరించారు. తదుపరి చర్యలు తీసుకునే వరకూ హోటల్‌ను మూసేశారు. కేసును అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళతామని, ఆపై హోటల్ యాజమాన్యానికి పెనాల్టీ విధిస్తామని పేర్కొన్నారు.