ESI Hospital: ఈఎస్ఐ ఆసుపత్రిలో దారుణం.. యువతిపై క్యాంటీన్ సిబ్బంది అత్యాచారం

Sanath Nagar ESI Hospital Canteen Helper Raped Young Girl
  • సోదరుడి చికిత్సకు సహాయంగా వచ్చిన యువతి
  • యువతిని షాదాబ్‌కు పరిచయం చేసిన సెక్యూరిటీ గార్డు
  • లిఫ్ట్‌లో వెళ్తుండగా రెండో అంతస్తులోకి తీసుకెళ్లి అఘాయిత్యం
  • నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్ సనత్‌నగర్‌లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో దారుణం జరిగింది. తన సోదరుడి చికిత్స కోసం సహాయకురాలిగా వచ్చిన యువతిపై ఆసుపత్రి క్యాంటీన్ సిబ్బంది ఒకరు లైంగికదాడికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటకకు చెందిన యువతి (19) తన సోదరుడికి గతంలో ఈఎస్ఐ ఆసుపత్రిలో చికిత్స చేయించింది. ఇటీవల మళ్లీ నొప్పి తిరగబెట్టడంతో ఈ నెల 6న ఆసుపత్రిలో చేర్చింది. శుక్రవారం సాయంత్రం సోదరుడికి ఆహారం కోసం వెళ్తున్న ఆమెను సెక్యూరిటీ గార్డు అడ్డుకుని క్యాంటీన్‌లో పనిచేసే షాదాబ్ (25)ను పరిచయం చేశాడు. 

సాయం అవసరమైతే అతడిని అడగాలని చెప్పాడు. సరేనని తిరిగి లిఫ్ట్‌లో వెళ్తున్న ఆమె వెనకే వెళ్లిన షాదాబ్ రెండో అంతస్తులోకి ఆమెను బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత రక్త పరీక్షలు చేసే గదిలో మరోమారు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో యువతి తన సోదరుడికి ఫోన్ చేయడంతో అతడొచ్చి కేకలు వేయడంతో నిందితుడు పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
ESI Hospital
Sanath Nagar
Hyderabad
Crime News

More Telugu News