చంచల్ గూడలో నీ ములాఖత్ లు మర్చిపోయావా జగన్?: నారా లోకేశ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంచల్ గూడలో నీ ములాఖత్ లు మర్చిపోయావా జగన్?: నారా లోకేశ్

Nara Lokesh fires on CM Jagan
  • చంద్రబాబుపై తప్పుడు కేసు పెట్టారన్న లోకేశ్
  • సిగ్గులేని జన్మ నీది అంటూ సీఎం జగన్ పై ఫైర్
  • ములాఖత్-మిలాఖత్ అంటూ పంచ్ డైలాగులు కొడుతున్నాడని కామెంట్ 
  • నీ బాబే మా బాబును ఏం చేయలేకపోయాడు అంటూ వ్యాఖ్యలు
చంద్రబాబు అరెస్ట్, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ సీఎం జగన్ ను విమర్శిస్తూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. 42 వేల కోట్ల రూపాయల ప్ర‌జాధ‌నం దోచేసి 38 కేసుల్లో ఏ1 గా ఉండి చంద్ర‌బాబుపై త‌ప్పుడు కేసు పెట్టి, అక్ర‌మ అరెస్టు చేయించిన‌ సిగ్గులేని జ‌న్మ నీది అంటూ మండిపడ్డారు. 

ములాఖ‌త్-మిలాఖ‌త్ అంటూ పంచ్ డైలాగులు కొడుతున్నావు... చంచ‌ల్ గూడలో నీ ములాఖ‌త్ లు మ‌రిచిపోయిన‌ట్టున్నావు అంటూ ఎద్దేవా చేశారు. 

"ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే" అని ఉర్దూలో ఒక సామెత ఉంది. ఒక మహా ముదురు దొంగ మంచి పోలీసును దొంగ దొంగ అంటూ తరిమాడన్నది దాని అర్థం. గ‌జ‌దొంగ జ‌గ‌న్ తీరు చూస్తే అలాగే  ఉంది. 2019 ఎన్నిక‌ల్లో మా టీడీపీని ఓడించ‌డానికి తెర‌వెనుక అయిన మిలాఖ‌త్‌లు నీకు గుర్తులేక‌పోవ‌చ్చు. 

అవినీతిప‌రుడైన‌వాడు నీతిమంతుల‌కి అవినీతిని అంట‌క‌ట్ట‌డం ఒక మానసిక రుగ్మ‌త‌. దీనినే Megalomania disorder అంటారు. బాబుగారిని అరెస్టు చేయించేందుకు లండ‌న్‌లో దాక్కున్న ప‌దిరోజుల‌లో నీ ఈ మాన‌సిక రుగ్మ‌త‌కి వైద్యం చేయించుకోవాల్సింది గ‌జ‌దొంగ జ‌గ‌న్! అవినీతి కి బ్రాండ్ అంబాసిడర్ అయిన నువ్వా నీతి క‌బుర్లు చెప్పేది? 

సొంత బాబాయ్‌పై గొడ్డ‌లి వేటు వేసిన నువ్వు వెన్నుపోటు అనే ప‌దం ఉచ్ఛ‌రించ‌డానికే అన‌ర్హుడివి. చ‌ట్టం అంద‌రికీ స‌మాన‌మే అయితే నువ్వు చేసిన దొంగ‌త‌నాలు, దోపిడీల‌పై కోర్టుల విచార‌ణ‌కి ప‌దేళ్లుగా ఎందుకు హాజ‌రు కావ‌డంలేదో ప్ర‌జ‌ల‌కి చెప్పాలి. 45 ఏళ్లుగా నిబ‌ద్ధ‌తతో రాజకీయాలు చేస్తున్న చంద్రబాబును జైలులో బంధించాన‌నుకుంటున్నావు. నీ బాబే, మా బాబుని ఏం చేయ‌లేక‌పోయాడు... 38 కేసుల్లో నిందితుడివి... నువ్వెంత‌?

అవినీతిపై ఆధారాలుంటే కోర్టులో కౌంట‌ర్ వేయ‌లేదేం గ‌జ‌దొంగ జ‌గ‌న్! రూపాయి అవినీతి జ‌ర‌గ‌లేద‌ని మేము అన్ని ఆధారాలు ఇచ్చాం. రూపాయి అవినీతి జ‌రిగింద‌ని చూపించే ఒక్క ఆధార‌మైనా నీ ద‌గ్గ‌ర ఉందా? సొంత బాబాయ్‌ని చంపేశావు, త‌ల్లిని త‌రిమేశావు, చెల్లిని బెదిరించావు... ప్ర‌జల సొమ్ము అడ్డంగా దోచేశావు. సొంత ఇంట్లో వాళ్ల‌కి బిడ్డ కాలేని గ‌జ‌దొంగ జ‌గ‌న్... జ‌నం ధ‌న‌, మాన ప్రాణాలు తీస్తూ ఊరంద‌రికీ బిడ్డ ఎలా అవుతాడో?" అంటూ నిప్పులు చెరిగారు.
Advertisement
Nara Lokesh
Jagan
Chandrababu
Arrest
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News