83 బంతుల్లోనే 174 పరుగులతో సన్‌రైజర్స్ ఆటగాడి ఊచకోత
- ఆస్ట్రేలియాతో నాలుగో వన్డేలో రెచ్చిపోయిన దక్షిణాఫ్రికా
- బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్
- 13 ఫోర్లు, 13 సిక్సర్లతో వీర విధ్వంసం
- 164 పరుగుల తేడాతో ఆసీస్ ను ఓడించిన సఫారీ జట్టు
ఐదో నెంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన క్లాసెన్ టీ20 తరహాలో బ్యాటింగ్ చేశాడు. మిల్లర్ (82 నాటౌట్)తో కలిసి ఐదో వికెట్‌కు 222 రన్స్ జోడించాడు. భారీ లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 34.5 ఓవర్లలో 252 పరుగులకే ఆలౌటైంది. దాంతో ఆ జట్టు 164 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అలెక్స్ క్యారీ (99) ఒక్కడే పోరాడాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 4వికెట్లు తీశాడు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్ ను దక్షిణాఫ్రికా 2-2తో సమం చేసింది. ఇరుజట్ల మధ్య చివరి, ఐదో వన్డే ఆదివారం జరుగుతుంది.