వైష్ణవ్ తేజ్ తో కృతి శెట్టి పెళ్లంటూ సోషల్ మీడియాలో ప్రచారం
- కృతి, వైష్ణవ్ ఇద్దరూ ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం
- 'ఉప్పెన' చిత్రంలో కలిసి నటించిన కృతి, వైష్ణవ్
- ఆ సమయంలోనే ప్రేమ మొదలయిందంటూ రూమర్స్
మరోవైపు కృతికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలోనే ఆమె తెలుగింటి కోడలు కాబోతోందనేనే ఆ ప్రచారం. మెగా హీరో వైష్ణవ్ తేజ్, కృతి ప్రేమలో ఉన్నారని, వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని రూమర్ బాగా స్ప్రెడ్ అవుతోంది. 'ఉప్పెన' చిత్రంలో వీరిద్దరూ జంటగా నటించారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ మొదలయిందని చెపుతున్నారు. అయితే ఈ పెళ్లి వార్తలపై కృతి, వైష్ణవ్ ఇద్దరూ ఇంతవరకు స్పందించలేదు. దీంతో, ఈ వార్త నిజమో, కాదో తేలాలంటే వేచి చూడాల్సిందే.