యుఎస్ ఓపెన్-2023 విజేతగా జకోవిచ్!
- రష్యా క్రీడాకారుడు మెద్వెదెవ్పై ఘన విజయం
- ఈ గెలుపుతో 24వ గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకున్న జకోవిచ్
- గతంలో 24 టైటిల్స్ గెలుపొందిన మార్గరెట్ కోర్టు రికార్డు సమం చేసిన వైనం
2021 నాటి యుఎస్ ఓపెన్‌లో మెద్వెదెవ్ చేతిలో పరాజయం పాలైన జకోవిచ్ ఈసారి టోర్నమెంట్లో అతడిపై పూర్తి ఆధిపత్యం కనబర్చాడు. తొలి సెట్లో 6-3 తేడాతో మెద్వెదెవ్‌ను చిత్తు చేశాడు. రెండో సెట్లో మెద్వెదెవ్ జకోవిచ్‌కు గట్టి పోటీ ఇవ్వడంతో ఒకానొక దశలో స్కోరు 6-6కు చేరి ఉత్కంఠ రేపింది. ఈ దశలో జకోవిచ్ తన అద్భుత ఆటతీరుతో 7-6తో సెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. తరువాతి సెట్లోనూ జకోవిచ్ దూకుడు కనబరుస్తూ 6-3తో గెలుపొందాడు. ఈ ఏడాది జకోవిచ్ ఆస్ట్రేలియా, ఫ్రెంచ్, యూఎస్ ఓపెన్ గెలుపొందగా వింబుల్డన్‌లో మాత్రం యువ ఆటగాడు కార్లోస్ అల్కరాస్ చేతిలో ఓటమి చవిచూశాడు.