గవర్నర్‌తో టీడీపీ నేతల భేటీ రేపటికి వాయిదా
- రేపు ఉదయం గం.9.45కు గవర్నర్‌ను కలవనున్న టీడీపీ నేతల బృందం
- అచ్చెన్నాయుడి నేతృత్వంలో గవర్నర్‌తో భేటీ కానున్న టీడీపీ నేతలు
- చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా రేపు ఏపీ వ్యాప్తంగా నిరసనలు
టీడీపీ నేతలు రేపు ఉదయం గం.9.45కు గవర్నర్‌తో భేటీ కానున్నారు. గవర్నర్‌ను కలిసే వారిలో అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, పల్లా శ్రీనివాస్, గండి బాబ్జీ, దువ్వారపు రామారావు, వేపాడ చిరంజీవిరావు, కొండ్రు మురళీమోహన్, కోరాడ రాజుబాబు తదితరులు ఉన్నారు. అరెస్ట్ సమయంలో సీఐడీ అధికారులు నిబంధనలు ఉల్లంఘించారని, గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. ఎఫ్ఐఆర్లో పేరులేని వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లనున్నారని తెలుస్తోంది.
రేపు ఏపీవ్యాప్తంగా నిరసనలు
చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో రేపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. శాంతియుత ర్యాలీలు, నిరసనలు చేపట్టనున్నారు.