అనుష్క మూవీ తొలి రోజు కలెక్షన్ రూ.4 కోట్లు
- తమిళంలో ఆదరణ అంతంతే
- తెలుగులో థియేటర్లకు ప్రేక్షకుల రాక ఫర్వాలేదు
- అమెరికాలో తొలిరోజు రూ.2.5 కోట్ల వసూళ్లు
అమెరికాలో తొలి రోజు రూ.2.5 కోట్ల ఆదాయం వసూలైనట్టు స్టూడియో ఫ్లిక్స్ గణాంకాలు చెబుతున్నాయి. షారూక్ ఖాన్ నటించిన జవాన్ కూడా నిన్ననే విడుదల కావడం తెలిసిందే. జవాన్ మొదటి రోజే రూ.75 కోట్లు వసూలు చేసింది. అతిపెద్ద సినిమా విడుదల రోజే మిస్ శెట్టిని తీసుకురావడం కూడా కొంత ప్రభావం పడేలా చేసింది. పి.మహేశ్ బాబు దర్శకత్వంలో వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాకు స్పందన మిశ్రమంగా ఉందని ప్రేక్షకుల అభిప్రాయాలను పరిశీలిస్తే తెలుస్తోంది.