మా కూటమి పేరు 'భారత్' అని పెట్టుకుంటే దేశం పేరును బీజేపీగా మారుస్తారా?: కేజ్రీవాల్
- మా కూటమి పేరును I.N.D.I.A.గా పెట్టుకున్నందుకే పేరు మారుస్తారా? అని ప్రశ్నించిన కేజ్రీవాల్
- ఈ దేశం 140 కోట్ల మందిదని, ఒక పార్టీది కాదని వ్యాఖ్య
- పేరు మార్పుపై తనకు అధికారిక సమాచారం లేదని స్పష్టీకరణ
అలాగే, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేశం ఒక రాజకీయ పార్టీకి చెందినది కాదన్నారు. జీ20 సమ్మిట్ విందు ఆహ్వాన పత్రికలపై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొనడం అందరిలోను అనుమానాలకు తావిచ్చిందని, పేరు మార్పుపై ఇది చర్చకు దారి తీసిందని పేర్కొన్నారు. ఇష్టానుసారంగా మార్చడానికి ఈ దేశం బీజేపీ సొత్తు కాదన్నారు. జుడేగా భారత్.. జీతేగా ఇండియా అంటూ చద్దా పేర్కొన్నారు.