మూడు రోజుల్లో రూ.70 కోట్లు రాబట్టిన 'ఖుషి'
- విజయ్ దేవరకొండ, సమంత జంటగా ఖుషి
- శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాణం
- సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం
- తొలిరోజే రూ.30 కోట్ల గ్రాస్
- చిత్రబృందంలో ఉత్సాహం
తొలి రెండ్రోజుల్లోనే రూ.50 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ చిత్రం... మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ రూ70.23 కోట్లు వసూలు చేసింది. కాగా, ఈ చిత్రానికి బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.53.5 కోట్లు. ఖుషి తొలిరోజే రూ.30 కోట్లు వసూలు చేయడంతో చిత్రబృందంలో ఉత్సాహం నెలకొంది. తమ చిత్రం బ్లాక్ బస్టర్ అని మైత్రీ మూవీ మేకర్స్ పేర్కొంది.