Vijayasai Reddy: పేరు గొప్ప టీడీపీ నేతలు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy slams TDP leaders
షార్ట్స్‌లో చూడండి
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ నేతలపై మరోసారి ధ్వజమెత్తారు. తోడేళ్లు గుంపుగా వస్తాయని, కానీ సింహం సింగిల్ గా వస్తుందని తెలిపారు. ఎన్ని తోడేళ్లు ఏకమై వచ్చినా ఏమీ కాదని, ఎప్పటికీ సింహమే గెలుస్తుందని పేర్కొన్నారు. "2024 తర్వాత తాము సోదిలో కూడా ఉండమన్న భయంతో పేరు గొప్ప టీడీపీ నేతలు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు. జగన్నాథ రథ చక్రాలను ఎవరూ ఆపలేరని ప్రతి ఒక్కరికీ తెలుసు" అంటూ విజయసాయి వివరించారు.
Go Back to Shorts
Vijayasai Reddy
Jagan
YSRCP
TDP
Andhra Pradesh

More Telugu News