జగన్ ను పొడిచిన కోడికత్తిని అందించింది బొత్స మేనల్లుడే: శ్రీనివాస్ తరపు లాయర్ సలీం
- దినేశ్ కుమార్ కు బొత్స మేనల్లుడు కోడికత్తిని అందించాడన్న సలీం
- నేరాన్ని శ్రీనుపై మోపారని వ్యాఖ్య
- రాజకీయాల కోసం కేసును సాగదీస్తున్నారన్న సలీం
కోడికత్తి దాడిలో ఎలాంటి కుట్ర లేదని ఎన్ఐఏ గతంలోనే చెప్పిందని సలీం తెలిపారు. రాజకీయాల కోసమే ఈ కేసును సాగదీస్తున్నారని చెప్పారు. మరోవైపు జగన్ కోర్టుకు వచ్చి, ఎన్ఓసీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విశాఖలో నిన్న నిరసన కార్యక్రమం చేపట్టాలని దళిత సంఘాల ఐక్య వేదిక నిర్ణయించింది. అయితే నిరసన కార్యక్రమం ప్రారంభం కాకముందే దళిత సంఘాల నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.