తొలిసారి సచివాలయానికి వచ్చిన గవర్నర్ తమిళిసై
- సీఎం కేసీఆర్ తో కలిసి ప్రార్థనా మందిరాలు ప్రారంభించిన గవర్నర్
- గుడి, మసీదు, చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఇరువురు
- ఇన్నాళ్లూ ఉప్పు- నిప్పుగా ఉన్న గవర్నర్, సీఎం
కొత్త సచివాలయం నిర్మించిన తర్వాత ఆ ప్రాంగణంలోకి గవర్నర్ రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. సచివాలయ ప్రారంభోత్సవం సమయంలో తనకు ఆహ్వానం లభించలేదని గవర్నర్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, నిన్న మంత్రిగా మహేందర్ రెడ్డి ప్రమాణస్వీకారం కోసం రాజ్ భవన్ కు వెళ్లిన సీఎం కేసీఆర్.. గవర్నర్ తో 20 నిమిషాల పాటు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగానే సచివాలయంలో ప్రార్థన మందిరాల ప్రారంభోత్సవాలకు ఆహ్వానించగా గవర్నర్ హాజరయ్యారు.