కులూలో పేక మేడల్లా కూలిన భవనాలు.. వీడియో ఇదిగో!
- హిమాచల్ ప్రదేశ్ లో కొండచరియలు విరిగి పడడంతో ఘటన
- అధికారుల ముందు జాగ్రత్తతో తప్పిన ప్రాణనష్టం
- రాష్ట్రాన్ని వీడని వానలు.. వరదలతో జనం అవస్థలు
పదుల సంఖ్యలో ఇళ్లు కుప్పకూలడం వీడియోలో కనిపిస్తోంది. దీంతో భారీగా దుమ్ము ఎగసిపడింది. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి ఆ ఏరియాలోని ప్రజలను రెండు రోజుల ముందే ఖాళీ చేయించినట్లు సమాచారం. దీంతో ప్రాణనష్టం తప్పిందని అధికారులు చెబుతున్నారు. బిల్డింగ్ ల శిథిలాల కింద ప్రమాదవశాత్తూ ఎవరైనా చిక్కుకుని ఉండొచ్చని, వారిని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని వివరించారు. ఇప్పటికే అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకున్నాయని చెప్పారు. ఈ ఘటన దురదృష్టకరమంటూ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖూ ట్వీట్టర్ లో ఆవేదన వ్యక్తంచేశారు. అప్రమత్తంగా వ్యవహరించి ప్రాణనష్టం తప్పించారంటూ అధికారులను మెచ్చుకున్నారు.