చంద్రయాన్-3: శ్రీహరికోట నుంచి సాధించడం మరింత ప్రత్యేకమంటూ జగన్ ట్వీట్
- బిర్లా ప్లానిటోరియంలో చంద్రయాన్-3 ప్రయోగం వీక్షించిన తెలంగాణ గవర్నర్
- చంద్రుడిపై భారత్ అంటూ బండి సంజయ్
- చారిత్రక విజయమన్న తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు
భారత్కు అపురూపమైన విజయమని, చంద్రయాన్-3 చంద్రుడిపై విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయినందుకు నేను, భారత ప్రజలు గర్విస్తున్నామని, ఇస్రోకు, అందరికీ నా శుభాకాంక్షలు అంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఈ అపురూపమైన విజయం ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుండి అడుగుపడటం మరింత ప్రత్యేకమని పేర్కొన్నారు.
ఇప్పుడు చంద్రుడిపై భారత్ అంటూ కరీంనగర్ ఎంపీ, బీజేపీ నేత బండి సంజయ్ ట్వీట్ చేశారు. చంద్రయాన్-3ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు సెల్యూట్, ఆవిష్కరణ అన్వేషణలో భారత్ అతిగొప్ప విజయం సాధించిందంటూ పేర్కొన్నారు. ఇది చారిత్రక విజయమని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై అన్నారు.