బిగ్ బాస్ -7లో సురేఖ వాణి, అబ్బాస్, ఫర్జానా?

Surekha Vani Abbas Farzana in Big Boss
  • సెప్టెంబర్ 3 నుంచి ప్రారంభం కానున్న బిగ్ బాస్ సీజన్ 
  • వరుసగా ఐదో సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించబోతున్న నాగార్జున
  • ఇటీవలే న్యూజిలాండ్ నుంచి ఇండియాకు వచ్చిన అబ్బాస్
పాప్యులర్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 7 సెప్టెంబర్ 3 నుంచి ప్రారంభం కాబోతోంది. హీరో నాగార్జున వరుసగా ఐదో సీజన్ కి హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. ఇప్పటికే కంటెస్టెంట్ ల ఎంపిక కూడా పూర్తయింది. కొందరి పేర్లు కూడా లీక్ అయ్యాయి. ఒకప్పటి క్రేజీ హీరోయిన్ ఫర్జానాను కూడా ఎంపిక చేసినట్టు సమాచారం. 2006లో తెలుగు పరిశ్రమకు పరిచయమైన ఫర్జానా పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇదే సమయంలో 'ప్రేమదేశం' ఫేమ్ అబ్బాస్ కూడా బిగ్ బాస్ కు ఎంపిక అయినట్టు సమాచారం. న్యూజిలాండ్ లో ఉంటున్న అబ్బాస్ ఇటీవలే ఇండియాకు వచ్చాడు. మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఇంకోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కూడా ఈ సీజన్ లో పాల్గొనబోతోందని సమాచారం. ఈ వార్త నిజమైతే ఈ సారి బిగ్ బాస్ హౌస్ కు మరింత గ్లామర్ వచ్చినట్టే.
Advertisement
Big Boss 7
Contestants
Abbas
Surekha Vani
Farzana

More Telugu News