హైదరాబాద్‌లో తుపాకి మిస్‌ఫైర్.. హెడ్‌కానిస్టేబుల్ మృతి

  • హైదరాబాద్‌లోని హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్‌లో ఘటన
  • రాత్రి విధులు నిర్వర్తించి వచ్చిన కానిస్టేబుల్ 
  • నిద్రిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు పేలిన తుపాకి
  • ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
తుపాకి మిస్‌ఫైర్ అయి హెడ్‌కానిస్టేబుల్ మరణించిన ఘటన హైదరాబాద్‌లోని హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కబుతర్ఖానా ప్రాంతంలో రాత్రి విధులు ముగించుకుని వచ్చిన హెడ్‌కానిస్టేబుల్ భూపతి శ్రీకాంత్ నిద్రించే సమయంలో అతడి చేతిలోని తుపాకి మిస్‌ఫైర్ అయింది. 

తూటాలు శరీరంలోకి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Gun Misfire
Hyderabad
Head Constable

More Telugu News