అకీరాకు హీరో అవ్వాలని లేదు: రేణూ దేశాయ్

  • అమెరికాలోని ఫిల్మ్ స్కూల్లో చేరిన అకీరా
  • సంబరాలు చేసుకున్న పవన్ ఫ్యాన్స్ 
  • వారి ఆనందంపై నీళ్లు చల్లిన రేణూ వ్యాఖ్యలు!
పవన్ కల్యాణ్ వారసుడిగా కీరా నందన్ పట్ల పవర్ స్టార్ ఫ్యాన్స్ హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఇటీవల అకీరా అమెరికాలోని ఫిల్మ్ స్కూల్లో చేరాడనగానే అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. కానీ, ఆ ఆనందం వారికి ఎక్కువ రోజులు మిగల్లేదు. అందుకు కారణం అకీరా తల్లి రేణూ దేశాయ్ వ్యాఖ్యలే. 

అకీరాకు హీరో వ్వాలని లేదని రేణు స్పష్టం చేశారు. "ఇప్పటివరకు అకీరా ఆలోచన ఇదే... అతడు హీరో కావాలని అనుకోవడంలేదు. ఇకముందు ఏం జరుగుతుందో చెప్పలేను. ఒకవేళ అకీరా హీరో అవ్వాలని అనుకుంటే ఆ విషయాన్ని నేనే సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తాను" అని రేణూ దేశాయ్ పేర్కొన్నారు. తాను ఇన్ స్టాగ్రామ్ లో ఏ పోస్టు పెట్టినా, దాని గురించి ఇష్టం వచ్చినట్టు రాసేస్తున్నారని ఆరోపించారు. 

అకీరా, తన మనవడు కార్తికేయ అమెరికాలోని ఓ ఫిల్మ్ స్కూల్లో చేరినట్టు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వెల్లడించిన సంగతి తెలిసిందే.

Renu Desai
Akira Nandan
Hero
Pawan Kalyan
Tollywood

More Telugu News